Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గిన్నిస్ రికార్డ్ కోసం 2,253 పేర్లు... వివాహంలో ఆ పేరు చదివేందుకే 20 నిమిషాలు

Laurence Watkins 2253 names for Guinness Record and 20 minutes to read name at wedding
Advertisement
  • ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్
  • పేరులో ఏకంగా 2,253 పేర్లు... చెప్పడానికి గంట సమయం
  • వివాహం సమయంలో 20 నిమిషాల పాటు పేరునే రికార్డింగ్‌లో వినిపించారు
  • గిన్నిస్ బుక్‌లో స్థానం కోసమే ఈ వినూత్న ప్రయత్నం
Advertisement
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న 'లారెన్స్ వాట్కిన్స్', తన వివాహం నాటి ఒక ఆసక్తికర సంఘటనతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆయన, తన వివాహం సమయంలో ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని ఇటీవల పంచుకున్నాడు.

1991లో జరిగిన తన వివాహ వేడుకలో భాగంగా, చట్టపరమైన నిబంధనల ప్రకారం వివాహం జరిపించే వ్యక్తి ఆయన పూర్తి పేరును ఉచ్చరించాల్సి వచ్చింది. అయితే అది అసాధ్యం కావడంతో, ఆ పేరును ముందుగానే రికార్డ్ చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ రికార్డింగ్ ప్లే అవుతుండగా, అతిథులంతా షాంపైన్ సేవిస్తూ వేచి చూడాల్సి వచ్చింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వాట్కిన్స్ 'ఐ డూ' (నేను అంగీకరిస్తున్నాను) అని చెప్పి వివాహం చేసుకున్నాడు.

న్యూజిలాండ్‌లో జన్మించిన ఆయన, లైబ్రరీ ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో 1990లో తన 24వ ఏట ఏదైనా ఘనత సాధించాలని భావించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను అధ్యయనం చేసిన అనంతరం, తనకూ సాధ్యమయ్యే ఒక రికార్డు కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఈ క్రమంలో నిఘంటువులు, చిన్నపిల్లల పేర్ల పుస్తకాల నుండి ఏకంగా 2,253 పేర్లను సేకరించి, చట్టబద్ధంగా తన పేరును మార్చుకున్నాడు.

తన పూర్తి పేరును నెమ్మదిగా చదవడానికి గంటకు పైగా సమయం పడుతుందని, ఒకవేళ వేగంగా చదివితే కనీసం 20 నిమిషాలు పడుతుందని వాట్కిన్స్ వెల్లడించాడు. అయితే, ఆ సుదీర్ఘమైన పేరులోని అన్ని పేర్లను తాను కూడా సరిగ్గా పలకలేనని ఆయన అంగీకరించాడు. అందుకే నిత్యజీవితంలో తనను అందరూ ఒక చిన్న పేరుతోనే పిలవాలని ఆయన కోరుకుంటున్నాడు.
Advertisement
Advertisement
Laurence Watkins
Guinness World Record
Longest Name in the World
Australia
Wedding Viral Story
New Zealand

More Telugu News